* Picture from Wikimedia Commons
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామము మరియు మండల కేంద్రం. చేబ్రోలు, గుంటూరు - చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. ఇది పొన్నూరు శాసనసభ నియోజక వర్గంలో భాగంగా ఉంది. భారతదేశంలోనే అరుదైన బ్రహ్మ ఆలయాల్లో ఒకటైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం చేబ్రోలులో ఉన్నది.
* Picture from Wikimedia Commons
భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో ఒకటి చేబ్రోలులో వుంది. ఇక్కడి బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి.పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శాసనాలు మరియు పురాతన నాణేలు లభ్యమైనవి. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు మరియు కాకతీయ సామ్రాజ్యములలోప్రాంతీయ దుర్గముగా ఉన్నది. చేబ్రోలుకు పూర్వము శంభోలు అనే పేరు ఉన్నది. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరుపుట్టింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమైనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి