నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

31, డిసెంబర్ 2009, గురువారం

తొమ్మిది పోయింది .. పది వచ్చింది :)

2010 నూతన సంవత్సర శుభాకంక్షలు!

Wish you a very Happy, Prosperous and a
Fun-filled new year - 2010
భవధీయుడు బ్లాగు బేవార్స్ :)

30, డిసెంబర్ 2009, బుధవారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...3

మొదటి భాగం క్లిక్ చేయండి, రెండో భాగం క్లిక్ చేయండి. కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి సంఘటన గురించి తెలుసుకున్న మరికొందరి స్పందనని ఈ కింది ఫొటోవ్యాఖ్యల రూపంలో చూద్దాం..






ఇంతలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ బ్రహ్మానందం మీడియా ముందుకు వచ్చారు , ఆయన ఇంటి వద్ద కోలహలంగా ఉంది, ఆయన ఎంచెబుతారని అందరు ఉత్ఖంటగా ఎదురుచూస్తున్నారు.బైటకి వస్తూనే ఇలా విచార వదనంతో కనిపించారు బ్రహ్మానందం గారు!

ఇంకాఉంది! అనుసంధాన టపాలో బ్రహ్మానందం గారి వివరణతో ముగుస్తుంది ఈ టపాల భాగోతం, మిమ్మల్ని అలరించడానికే ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి!
Will be back soon :)

29, డిసెంబర్ 2009, మంగళవారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...2

కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి సంఘటన గురించి తెలుసుకున్న మరికొందరి స్పందనని
ఈ టపాలోని ఫొటోలలో చూద్దాం





ఇంకాఉంది! ముచ్చటగా మూడవ భాగంలో ముగిస్తా :)
ఇక్కడ మొదటి భాగం క్లిక్ చేయండి ఈ కథ పూర్తిగా కల్పితం కేవలం హాస్యం కోసం మాత్రమే,ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి.

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...1

ఈ కథ పూర్తిగా కల్పితం కేవలం హాస్యం కోసం మాత్రమే,ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి. ఓ రొజు ఒక చిన్న సినిమా షూటింగు పై ఎవరో ఆందోళనకారులు దాడి చేసారు, వారిని నచ్చచెప్పేందుకు వచ్చిన కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి చేశారనే వార్త గుప్పుమంది.సినీ రంగంలో అలజడి మొదలైంది.
ఈ సంఘటన పై సినీ రంగ ప్రముఖులు ఎలా స్పందించారు అనే దానిని వారి ఫోటోలకు వ్యాఖల రూపంలో వారి హహాభావాలకు అనుగునముగా పెట్టాను. మొదట కొందరి స్పందన చూద్దం కింద ఫోటోలలో ..







మిగితా వారు కూడా ఎలా స్పందించారో మారో అనుసంధాన టపాలో పెడతాను, ఇంకాఉంది!
ఈ టపా పెట్టడానికి పరోక్ష స్పూర్థినిచ్చిన "ANALYSIS <<<>>> అనాలిసిస్" బ్లాగరు శీను గారికి ప్రెత్యేక ధన్యవాదములు

28, డిసెంబర్ 2009, సోమవారం

2009 మీడియాకి పండగ

ఈ 2009 సంవత్సరం ఎవరికి ఎలా గడిచిందో కాని మన రాష్ట్ర మీడియా(print & electronic) మాత్రం బాగా లాభపడింది, పండగ చేసుకుంది.అవసరమైన వాటితో పాటు అనవసరమైనవి కూడా ఈ 2009లో బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్య సంఘటనలు:
1. సత్యం కుంభకోణం
2. ఎన్నికల ప్రచారం ( త్రిముఖమైన రసవత్తర పోరు)
3. ఎన్నికల ఫలితాలు ( మళ్ళి గెలిచిన కాంగ్రెస్స్ )
4. పతనావస్థకు చేరిన ప్రజారాజ్యం పార్టీ
5. ముఖ్య మంత్రి వైయస్ అకాల మరణం
6. కృష్ణ నది వరద భీబత్సం,(ఇక్కడే మీడియా పోటపోటి హడావిడి చేసింది)
7. రోశయ్య పాలన కుంటుపడడం
8. ఓబులాపురం వ్యవహారం
9. ప్రెత్యేక తెలంగాణ ఉద్యమం
10. సమైక్యాంధ్రా ఉద్యమం

వీటన్నిటికీ తోడు పుండు మీద కారం జల్లినట్టు గవర్నర్ రాసలీలల వ్యవహారం..

అందుకే 2009 బ్రేకింగ్ న్యుస్ నామ సంవత్సరం :)

26, డిసెంబర్ 2009, శనివారం

ఏం తెలుసు?

గాలిలోకి ఎగిరిన రాయికి ఏం తెలుసు,
అది ఒక అద్దాన్ని పగలగొడుతుందని!

రోడ్డు మీద తిరిగే బస్సుకి ఏం తెలుసు,
తను ఆల్లర్లల్లో తగలబడుతుందని!

ప్రభుత్వ ఆఫిసులకి ఏం తెలుసు,
ఉద్యమాల్లో తాము ధగ్థం అవుతామని!

సామాన్య పౌరుడికి ఏం తెలుసు,
ఆఖరికి కుటిల రాజకీయాలకి బలి అవుతామని!

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఉత్తమ & చెత్త తెలుగు సినిమాలు - 2009

ఈ సంవత్సరం తెలుగు సినిమాలకి ఏమీ బాలేదు, బహుశా సంవత్సర ఆరంభం మరియు ముగింపులో పోసాని కృష్ణ మురళి సినిమాలు రావడం వల్లేమో! jan 1న మెంటల్ కృష్ణ, Dec 25న పోసాని జెంటిల్మన్ సినిమాలు వచ్చాయి, పేర్లు కూడా భలే కుదిరాయి "mental", "gentle" :)

ఉత్తమ తెలుగు సినిమాలు - 2009:

1. అరుంధతి
2. నేను దేవుడ్ని
3. ఆకాశమంతా
4. బిల్లా
5. ఓయి! (OYE!)
6. ప్రయాణం
7. మగధీర
8. బెండు అప్పారావు RMP
9. విలేజిలో వినాయకుడు
10. కథ

చెత్త తెలుగు సినిమాలు - 2009:

1. మస్కా
2. కొంచం ఇష్టం కొంచం కష్టం
3. మిత్రుడు
4. కిక్
5. కరంట్
6. ఆంజనేయులు
7. మల్లన్న
8. మహాత్మ
9. ఏక్ నిరంజన్
10. ఆర్య -2

నాకు నచ్చినవి మరియు నచ్చనివి మాత్రమే పెట్టాను ,వాటి గురించి విశ్లేషణ మరో టపాలో పెడతాను, ఇంక 2012 యుగాంతం మరియు అవతార్ చిత్రాలు అదరగొట్టాయి 2009 చివరిలో ...

24, డిసెంబర్ 2009, గురువారం

సమైక్య పుర్రెలు

రకరకాల పుర్రెల ఫోటోలు ఇక్కడ పెడుతున్నాను, ఇందులో గీసిన బొమ్మలు,
3D లో చేసినవి కూడా ఉన్నాయి, వివిధ అంతర్జాల సైట్లలోంచి వెతికి పట్టుకున్న పుర్రెలు:
సరదా కోసం :)

23, డిసెంబర్ 2009, బుధవారం

పాపం పోలీసులు..

మన రాష్ట్రం అట్టుడుకుతోంది , ఎక్కడ చూసిన నిరసనలు, బంద్లు, విద్వంసాలు వెరసి సామాన్యులకు(మనకు) తీవ్ర అసౌకర్య పరిస్తితి . మన సంగతి పక్కన పెడితే ఇక పోలీసులకి నరకం కనపడుతోంది నెల రోజుల నుండి.( ఉద్యమాలు, నిరసనలు, బందల సమయం లో మాత్రమే వ్యాసం పనికొస్తుంది ). చేతిలో ఆయుధం ఉన్నా ఎవరి మిద అధికారం లేకుండా ప్రయోగించకూడదు, దెబ్బలు తగిలి రక్తం కారుతున్న సంయమనం పాటించాలి, మనసుకు నచాకపోయిన పై అధికారులు చెప్పినట్టు నడుచుకోవాలి. తల బొప్పి కడుతోంది వారికీ, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలిదు, అంతా ఉత్ఖంటత, రాజకీయ నాయకుల నాటకాలలో వారు బలి పశువులు అవుతున్నారు కూడా (ఒక ఎంపి రాజధానికి పారిపోయి వచ్చిన ఘటనలో) అటు ఇటు అయి బాగా నలిగిపోతున్నారు, రాష్ట్రంలో పాలనా స్థంబించింది , పోలీసులు సాధారణ విధి నిర్వహణ కంటే బందోబస్తులు పెరిగిపోయాయి ఉద్యమాల దెబ్బతో , మొత్తానికి మనకు {సామాన్యులకు}వోరిగేది ఏమి లేని ఉద్యమాల నడుమ విద్యార్థులు బలైపోతున్నారు. ఇంక రవాణా వ్యవస్త దేబ్బడింది. ఎప్పుడు సద్దుమనుగుద్దో ఏమో !

ఇటువంటి పరిస్తితుల్లో సంయమనం కోల్పోకుండా తమ విధులు నిర్వహిస్తున్న పోలిసువాళ్ళకి ధన్యవాదములు !

21, డిసెంబర్ 2009, సోమవారం

నేనో బ్లాగు బేవార్స్


నా గురించి చెప్పుకోడానికి ఎమీ లేదు, నేను ఎవరో నాకే తెలీదు, అది తెలుసుకోవాలనే నా ప్రయత్నం.. ఈ బ్లాగు ప్రపంచంలో నా గురించి తెలుసుకోవచ్చేమో అని ఇక్కడికొచ్చాను అంతే.

ఇక్కడ నేను చాలా విషయాల పై నా అభిప్రాయాలు, సూచనలు, ఇష్టాయిష్టాలు తెలియజేస్తాను, అవి నా అభిప్రాయాలు మాత్రమే, ఎవరినీ నొప్పించడానికి కాదని నా మనవి.

ధన్యవాదములు
బ్లాగు బేవార్స్ :)