పెంచల కోన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము.
Penchalakona village is located in Rapur mandal of Nellore district in Andhra Pradesh. It is 70 km from Nellore town. Penchalakona houses the temple of Sri Penusila Narasimha Swamy, which is situated at the foot of a hill.
* Picture credit goes to original photographer and source
ఇక్కడ నరసింహస్వామి ఆలయం కలదు. ఇది నెల్లూరునకు 70 కిమీ దూరంలో కలదు. రాస్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విబేధాలు లేక స్వామి వారిని దర్శించి పాపముల నుండి విముక్తులగుచున్నారు.
ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మద్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మద్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ.
తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని అంటూఉంటారు. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్కి, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి