నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

14, డిసెంబర్ 2010, మంగళవారం

కనుమరుగవుతున్న హీరోలు!

మామూలు సినిమాలతో వచ్చి,
అద్భుతమైన హిట్లు కొట్టి, ఆ తర్వాత,
అన్ని సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్దమయ్యరు పైన చెప్పబడిన హీరోలు,
వాళ్ళలో కొందరిని మన సినీ పెద్దలే తొక్కేశారు ( ఉదయ్ కిరణ్ , రాజా )
ఇంకొందరు దండయాత్రలు కొనసాగిస్తున్నారు ( తరుణ్, నితిన్, సిద్ధర్థ్ )
కానీ వీళ్ళందరిలోకి మంచి కెరీర్ గ్రాఫ్ ఉంది మాత్రం ఒక్క రాజా నే,
కాని రాజా కి మంచి అవకాశల్లెవ్, ఎందుకంటె అతనికి Background లేదు,
ఉదయ్ కిరణ్ ని పూర్తిగా ముంచేసింది ఎవరో అందరికీ బాగా తెలుసు కద !

12, డిసెంబర్ 2010, ఆదివారం

భూత సుందరి దెబ్బకి సినిమాలు మటాష్!


అరుంధతి సినిమా తర్వాత ఆరడుగుల అనుష్క ని ఆకాశానికి ఎత్తేసారు ,
కానీ ఆమె ఏది ముట్టుకుంటే అది మాడి మసైపోతుంది ప్రస్తుతం !


2005 నుంచి ఆమె నటించిన సినిమాలలో 2 హిట్లు మాత్రమే ఉన్నాయి
అరుంధతి తర్వాత అన్నీ ఫ్లాపులే.


అమ్మా కాస్త జాగ్రత్త లేకపోతె ఇంకొన్ని రోజుల్లో బొమ్మాళి ఫటక్

4, డిసెంబర్ 2010, శనివారం

రాబోయే తెలుగు సినిమా పేర్లు :)

రాబోయే తెలుగు సినిమా పేర్లు:

సినిమా పేరు- దాని క్యప్షన్

పాకుడు- వీడికి నడవడం రాదు

వంగుడు- వీడో ముసలాడు

చలి- గిలి

వులి- చెక్కుతాడు

మీగడ- వీడో తిండిపోతు

నురగ- నిజం కక్కేస్తాడు

సుత్తి- కొట్టి చంపేస్తాడు

బుట్ట- అల్లేస్తాడు జాగ్రత్త

రంపం- కోత పెట్టేస్తాడు

చాకు- కోసిపారెస్తాడు

బెండకాయ- బాగా ముదురు

ఆలుగడ్డ- అలిగాడు

వంకాయ- ఎందుకూ పనికిరాడు

టెంకాయ- తిక్కలోడు
:)

2, డిసెంబర్ 2010, గురువారం

తెలుగు కథానాయిక: సందీప్తి

సందీప్తి:

చాలా రోజులకి మళ్ళి తెలుగు తెర పై ఒక తెలుగు కథానాయిక, సందీప్తి (Sandeepthi).
ఆమె స్వస్థలం విజయనగరం (ఉత్తరాంధ్ర)

ఆమె నటించిన తొలి చిత్రం "యంగ్ ఇండియా", దాసరి దర్శకత్వంలో వచ్చింది ఆ చిత్రం.
ఈ అమ్మాయి ఆ చిత్రంలో నటనకి మంచి మార్కులు కొట్టేసింది,
ప్రస్తుతం మరొ రెండు తెలుగు చిత్రాల్లో చేస్తుంది, ఈ అమ్మాయి మంచి కూచిపూడి నర్తకి కూడా,
వైజాగ్ లోని "నాట్య రవళి " డ్యాన్స్ అకాడమిలో నృత్యాభ్యాసం చేసింది.
సందీప్తి మంచి హాహా భావాలు పలికించగలదు, మన దర్శకులు అవకాశం ఇస్తే ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

All the Best! సందీప్తి

1, డిసెంబర్ 2010, బుధవారం

బడా హైదరాబాద్! HMDA