గత 40 రోజులుగా మన రాష్ట్రంలో ఉద్యమాలతో ఆందోళనకర పరిస్తితులు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజానీకం ఆందోళనల సెగకి అట్టుడుకుతోంది. ఎప్పుడు పరిస్తితి ఎలా ఉంటుందో అని గడపాల్సోస్తుంది , చదువులు కుంటుపడ్డాయి, ధరలు పెరిగిపోయాయి, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం, ప్రభుత్వ ఆస్తులు తగలబడిపోతున్నాయి , అదాయ వనరులు సగానికి సగం ఆగిపోయాయని వార్తలు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎ ఇద్దరు వ్యక్తులు కలిసినా రెండిటి మీదే చర్చ, దేని మీదో బ్లాగరులు అందరికి తెలుసు.
కుటిల స్వార్థపూరిత రాజకీయాలకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు బలిఅవుతున్నారు, మధ్యతరగతి వారికీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది, ప్రతి సామాన్యుడికి ఈ పరిస్తితులు ఆటంకం కల్పిస్తున్నాయి ఏదో ఒక రూపంలో . అందరిలోనూ ఒక భావోద్వేగం ప్రస్ఫుటంగా ఉంది, అది అంతర్లీనంగా లేదా బాహ్యముగా అయిన కావచ్చు.ఈ హడావిడి లో బాగా నష్టపోయింది APSRTC . బస్సులు కాలి బుడిదవుతున్నాయి, ద్వంసం చేయబడి నిస్సహాయంగా చూస్తున్నాయి, 15 రోజులపాటు బస్సులు తిరగలేదు రాష్ట్రంలో , కొన్ని కోట్ల నష్టం వచ్చింది, (ఇప్పుడు చార్జీలు పెంచారు).
చిన్న వ్యాపారాలు చేస్కునే వారు, కూలీలు కూడా బాగా నష్టపోయారు. ఎప్పుడు ,మళ్ళి మామూలు రోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు, ఉద్యమాల సెగ అన్ని రంగాల పై భారి ఎత్తున ప్రభావన్ని చూపింది, మీడియా అత్యుత్సాహం ఈ రోజు ఒక పెద్ద సంస్థకి తలనొప్పై కూర్చుంది, మన రాష్త్రంలో నష్టాన్ని మిగిల్చింది, ఒక దాని తర్వాత ఒకటి అంటుకుంటన్నాయి, ఇదెంతకాలమో ?
అడిగే వారు లేరు. ఒక నిస్సహాయునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అన్నది కాదనలేని సత్యం.
అసలు విడిపోతే ఎంటి లాభం? కలిసుంటే ఎంటి నష్టం? ఎటు చూసిన సమాధనం అంత తేలికగా దొరకని ప్రశ్నలే మన ముందున్నాయి, అయినా మనమంతా తెలుగు వాళ్ళమే, భారతీయులమే.
విడిపోయినా, కలిసున్నా మనమంతా ఒక్కటే!
ఈ మధ్య వచ్చిన కృష్ణవంశి చిత్రం మహాత్మ లోని ఒక పాట మన కోసం:
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తలవంచి కైమొడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కనిపెంచినాదని
కనుక తులలేని జన్మంబు నాదని
త్రిలింగ ధామం త్రిలోకాభిరామం
అనన్యం అగన్యం ఏదో పూర్వ పుణ్యం
త్రిసంధ్యాధి వంధ్యం అహొ జన్మ ధన్యం
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
శ్రీ మహవిష్నువే శ్రికాకులాంధ్రుడై శ్రికారమును చుట్టె నీ చరితకీ
శ్రీశైల భీమెశ కాళేశుడై హరుడు ప్రాకారమును కట్టె నీ సీమకి
సింగంబు పై తిరుగు పురుషకేసరి శాతవాహనుదు పూర్వజుడు నీజాతికి
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన భద్రాద్రి చాలు నీ ప్రఖ్యాతికి
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తరతరంబులు దాటి తరలివచ్చిన మహత్ముల తపస్సంపతి నీ వారసత్వం
ఇచ్చత పుట్టిన చిగురు కొమ్మైన చేవయని అంధ్రులకు అందినది ఆర్యసత్వం
మువ్వన్నె జండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ సొంతం
బారతంబునకు పెద్దకొడుకుగా మనగలుగు ఆత్మగౌరవముతో వర్ధిల్లు నిత్యం
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
ఈ పాటని కింది వీడియోలో చూడచ్చు
ఈ తెలుగు నేల మనది, తెలంగాణ , రాయలసీమ, కోస్తాంధ్ర అన్నీ మనవే మనం మూడు ముక్కలైనా తెలుగు వాళ్ళమే. తెలుగు వాడినని గర్వించు, తెలుగు వాడిగా జీవించు, తెలుగు తల్లైన, తెలంగాణా తల్లైన అందరికీ తల్లితల్లే.
(ఈ వ్యాసం ఎవరినీ నొప్పించడానికి, కించపరచడానికి కాదని మనవి, ఇది ఒక బ్లాగుబేవార్స్ ఘోష అంతే!..)