నా గురించి

నా ఫోటో
నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)

23, డిసెంబర్ 2009, బుధవారం

పాపం పోలీసులు..

మన రాష్ట్రం అట్టుడుకుతోంది , ఎక్కడ చూసిన నిరసనలు, బంద్లు, విద్వంసాలు వెరసి సామాన్యులకు(మనకు) తీవ్ర అసౌకర్య పరిస్తితి . మన సంగతి పక్కన పెడితే ఇక పోలీసులకి నరకం కనపడుతోంది నెల రోజుల నుండి.( ఉద్యమాలు, నిరసనలు, బందల సమయం లో మాత్రమే వ్యాసం పనికొస్తుంది ). చేతిలో ఆయుధం ఉన్నా ఎవరి మిద అధికారం లేకుండా ప్రయోగించకూడదు, దెబ్బలు తగిలి రక్తం కారుతున్న సంయమనం పాటించాలి, మనసుకు నచాకపోయిన పై అధికారులు చెప్పినట్టు నడుచుకోవాలి. తల బొప్పి కడుతోంది వారికీ, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలిదు, అంతా ఉత్ఖంటత, రాజకీయ నాయకుల నాటకాలలో వారు బలి పశువులు అవుతున్నారు కూడా (ఒక ఎంపి రాజధానికి పారిపోయి వచ్చిన ఘటనలో) అటు ఇటు అయి బాగా నలిగిపోతున్నారు, రాష్ట్రంలో పాలనా స్థంబించింది , పోలీసులు సాధారణ విధి నిర్వహణ కంటే బందోబస్తులు పెరిగిపోయాయి ఉద్యమాల దెబ్బతో , మొత్తానికి మనకు {సామాన్యులకు}వోరిగేది ఏమి లేని ఉద్యమాల నడుమ విద్యార్థులు బలైపోతున్నారు. ఇంక రవాణా వ్యవస్త దేబ్బడింది. ఎప్పుడు సద్దుమనుగుద్దో ఏమో !

ఇటువంటి పరిస్తితుల్లో సంయమనం కోల్పోకుండా తమ విధులు నిర్వహిస్తున్న పోలిసువాళ్ళకి ధన్యవాదములు !

7 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

yes. really they are doing a good job.

శరత్ కాలమ్ చెప్పారు...

Yes

Sujata M చెప్పారు...

చాలా మంచి టపా ! పోలీసులంటే ఆమాత్రం అభిప్రాయం ఉన్నందంటే అది ఇలాంటి సందర్భాలలో సమర్ధ పోలీసింగ్ వల్లనే. ఐ.జీ. అనూరాధ గారి స్టేట్మెంట్లు చూసారా ? 'కేసులు ఎత్తివేస్తారని భ్రమ పడొద్దు !' 'పోలీసు దెబ్బలకు ఆరోగ శ్రీ వర్తించదు!' - వాహ్ ! ఈ రోజు తెరాస అధ్యక్షులు కార్యకర్తలని పోలీసులకి ప్రతికూలంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ! చూడండి.

Indian Minerva చెప్పారు...

Right. The situation would have been much worse without them.

సుజాత వేల్పూరి చెప్పారు...

అవును, సరిగ్గా చెప్పారు! కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది వాళ్ల పరిస్థితి! ఖాకీ బతుకులు నవల చదివినప్పటికంటే ఈ ఉద్యమాల్లో వీళ్ల కష్టాలు చూస్తుంటే జాలేస్తోంది. ఎన్నికల సమయంలో ఎంతో సమర్థుడిగా పేరు తెచ్చుకున్న అధికారి సైతం లగడపాటి డ్రామాతో సస్పెండైపోయాడు.

ఉద్యమకారుల్ని (ఈ పదం ఎంత హాస్యాస్పదమైపోయిందో చెప్పలేను) కొడితే నాయకులూరుకోరు. కొట్టకపోతే ప్రభుత్వం ఊరుకోదు.నిద్రాహరాలు మాని రాష్ట్ర ప్రజలకంటే టెన్షన్ పడి చచ్చిపోతోంది పోలీసులే! అడకత్తెరలో పోకచెక్కలయ్యారు.


నిజంగానే ఇలాంటి పరిస్థితుల్లో బ్రేక్ కాకుండా బరస్ట్ కాకుండా విధులు నిర్వహించాలంటే ఎంతో సంయమనం కావలసిందే!

మైత్రేయి చెప్పారు...

Yes. I have seen personally how difficult is their life.

Imagine those coming from long distances on duty. They will not have proper places to stay and sleep. they will be given bad quality food.

I thank each and every one of them for all the pains they are going through.

Chandamama చెప్పారు...

Well said.