నా గురించి
- NAM blogsapien :)
- నేనో అలుపెరగని బాటసారిని. గమ్యమెరుగని దేశదిమ్మరిని...:)
రాజకీయరంగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజకీయరంగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, అక్టోబర్ 2012, గురువారం
10, మార్చి 2011, గురువారం
డజను మంది స్వార్థం.. ఈ రావణ కాష్టం!
ఆస్తుల కోసం డజను మంది స్వార్థం
తెచ్చిపెట్టింది తొమ్మిది కోట్ల మందికి కష్టం!
ఇది తెలుగు నేలకు తీరని నష్టం
ఎప్పుడు ఆరుతుందో ఈ రావణ కాష్టం !!
లేబుళ్లు:
నా భావాలు,
నాలో ఓ కవి,
రాజకీయరంగు
10, ఫిబ్రవరి 2011, గురువారం
6, ఫిబ్రవరి 2011, ఆదివారం
12, జనవరి 2011, బుధవారం
16, ఫిబ్రవరి 2010, మంగళవారం
ప్రతిదానికి గోల!
ఆందోళన లు, ధర్నాలు , బందులు,ఏది సామరస్యంగా పరిష్కరించుకుందాం
అన్న ఆలోచనలో Nobody is there,
ఇది తెలుగు జాతి దౌర్భాగ్యం, అధ్వాన్నపు గ్రహస్థితి ప్రభావం,
పిల్లల చదువులు అటకెక్కాయి, వారు బలిపసువులవుతున్నారు,
వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాయి, క్రీడలు పారిపోయాయి,
వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకున్తున్నాయి, క్రీడలు పారిపోయాయి,
అన్ని ప్రాంతాలలోను నాయకులకి ఎటువంటి నష్టం లేదు ,
అ బొక్కంతా మనలాంటి సామాన్యులకే ,
ఇన్ని నెలల ఆందోళనలో ఒక్క నాయకుడికి గని, వారి అనుచారులకుగాని నష్టం జరిగిందా? లేదు
జనాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్న
స్వార్థ నాయకులకు దిమ్మతిరిగి మైండు బ్లాకయ్యే రోజు will come.
ఇది మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నాయకులకి వర్తిస్తుంది,
ఎందుకంటే "అందరు దొంగలే " (దొరికితే)
లేబుళ్లు:
నా భావాలు,
రాజకీయరంగు
7, జనవరి 2010, గురువారం
కుదేలైన తెలుగునేల ..!
గత 40 రోజులుగా మన రాష్ట్రంలో ఉద్యమాలతో ఆందోళనకర పరిస్తితులు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజానీకం ఆందోళనల సెగకి అట్టుడుకుతోంది. ఎప్పుడు పరిస్తితి ఎలా ఉంటుందో అని గడపాల్సోస్తుంది , చదువులు కుంటుపడ్డాయి, ధరలు పెరిగిపోయాయి, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం, ప్రభుత్వ ఆస్తులు తగలబడిపోతున్నాయి , అదాయ వనరులు సగానికి సగం ఆగిపోయాయని వార్తలు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎ ఇద్దరు వ్యక్తులు కలిసినా రెండిటి మీదే చర్చ, దేని మీదో బ్లాగరులు అందరికి తెలుసు.
కుటిల స్వార్థపూరిత రాజకీయాలకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు బలిఅవుతున్నారు, మధ్యతరగతి వారికీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది, ప్రతి సామాన్యుడికి ఈ పరిస్తితులు ఆటంకం కల్పిస్తున్నాయి ఏదో ఒక రూపంలో . అందరిలోనూ ఒక భావోద్వేగం ప్రస్ఫుటంగా ఉంది, అది అంతర్లీనంగా లేదా బాహ్యముగా అయిన కావచ్చు.ఈ హడావిడి లో బాగా నష్టపోయింది APSRTC . బస్సులు కాలి బుడిదవుతున్నాయి, ద్వంసం చేయబడి నిస్సహాయంగా చూస్తున్నాయి, 15 రోజులపాటు బస్సులు తిరగలేదు రాష్ట్రంలో , కొన్ని కోట్ల నష్టం వచ్చింది, (ఇప్పుడు చార్జీలు పెంచారు).
చిన్న వ్యాపారాలు చేస్కునే వారు, కూలీలు కూడా బాగా నష్టపోయారు. ఎప్పుడు ,మళ్ళి మామూలు రోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు, ఉద్యమాల సెగ అన్ని రంగాల పై భారి ఎత్తున ప్రభావన్ని చూపింది, మీడియా అత్యుత్సాహం ఈ రోజు ఒక పెద్ద సంస్థకి తలనొప్పై కూర్చుంది, మన రాష్త్రంలో నష్టాన్ని మిగిల్చింది, ఒక దాని తర్వాత ఒకటి అంటుకుంటన్నాయి, ఇదెంతకాలమో ?
అడిగే వారు లేరు. ఒక నిస్సహాయునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అన్నది కాదనలేని సత్యం.
అసలు విడిపోతే ఎంటి లాభం? కలిసుంటే ఎంటి నష్టం? ఎటు చూసిన సమాధనం అంత తేలికగా దొరకని ప్రశ్నలే మన ముందున్నాయి, అయినా మనమంతా తెలుగు వాళ్ళమే, భారతీయులమే.
విడిపోయినా, కలిసున్నా మనమంతా ఒక్కటే!
ఈ మధ్య వచ్చిన కృష్ణవంశి చిత్రం మహాత్మ లోని ఒక పాట మన కోసం:
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తలవంచి కైమొడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కనిపెంచినాదని
కనుక తులలేని జన్మంబు నాదని
త్రిలింగ ధామం త్రిలోకాభిరామం
అనన్యం అగన్యం ఏదో పూర్వ పుణ్యం
త్రిసంధ్యాధి వంధ్యం అహొ జన్మ ధన్యం
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
శ్రీ మహవిష్నువే శ్రికాకులాంధ్రుడై శ్రికారమును చుట్టె నీ చరితకీ
శ్రీశైల భీమెశ కాళేశుడై హరుడు ప్రాకారమును కట్టె నీ సీమకి
సింగంబు పై తిరుగు పురుషకేసరి శాతవాహనుదు పూర్వజుడు నీజాతికి
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన భద్రాద్రి చాలు నీ ప్రఖ్యాతికి
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తరతరంబులు దాటి తరలివచ్చిన మహత్ముల తపస్సంపతి నీ వారసత్వం
ఇచ్చత పుట్టిన చిగురు కొమ్మైన చేవయని అంధ్రులకు అందినది ఆర్యసత్వం
మువ్వన్నె జండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ సొంతం
బారతంబునకు పెద్దకొడుకుగా మనగలుగు ఆత్మగౌరవముతో వర్ధిల్లు నిత్యం
తలయెత్తి జీవించు తమ్ముడా
తెలుగు నెలలొ మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
ఈ పాటని కింది వీడియోలో చూడచ్చు
ఈ తెలుగు నేల మనది, తెలంగాణ , రాయలసీమ, కోస్తాంధ్ర అన్నీ మనవే మనం మూడు ముక్కలైనా తెలుగు వాళ్ళమే. తెలుగు వాడినని గర్వించు, తెలుగు వాడిగా జీవించు, తెలుగు తల్లైన, తెలంగాణా తల్లైన అందరికీ తల్లితల్లే.
(ఈ వ్యాసం ఎవరినీ నొప్పించడానికి, కించపరచడానికి కాదని మనవి, ఇది ఒక బ్లాగుబేవార్స్ ఘోష అంతే!..)
లేబుళ్లు:
అవి.. ఇవి.. అన్నీ,
నా భావాలు,
రాజకీయరంగు
28, డిసెంబర్ 2009, సోమవారం
2009 మీడియాకి పండగ
ఈ 2009 సంవత్సరం ఎవరికి ఎలా గడిచిందో కాని మన రాష్ట్ర మీడియా(print & electronic) మాత్రం బాగా లాభపడింది, పండగ చేసుకుంది.అవసరమైన వాటితో పాటు అనవసరమైనవి కూడా ఈ 2009లో బాగా ప్రాచుర్యం పొందాయి. 

ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్య సంఘటనలు:


1. సత్యం కుంభకోణం
2. ఎన్నికల ప్రచారం ( త్రిముఖమైన రసవత్తర పోరు)
3. ఎన్నికల ఫలితాలు ( మళ్ళి గెలిచిన కాంగ్రెస్స్ )
4. పతనావస్థకు చేరిన ప్రజారాజ్యం పార్టీ
5. ముఖ్య మంత్రి వైయస్ అకాల మరణం
6. కృష్ణ నది వరద భీబత్సం,(ఇక్కడే మీడియా పోటపోటి హడావిడి చేసింది)
7. రోశయ్య పాలన కుంటుపడడం
8. ఓబులాపురం వ్యవహారం
9. ప్రెత్యేక తెలంగాణ ఉద్యమం
10. సమైక్యాంధ్రా ఉద్యమం
వీటన్నిటికీ తోడు పుండు మీద కారం జల్లినట్టు గవర్నర్ రాసలీలల వ్యవహారం..

అందుకే 2009 బ్రేకింగ్ న్యుస్ నామ సంవత్సరం :)

అందుకే 2009 బ్రేకింగ్ న్యుస్ నామ సంవత్సరం :)
లేబుళ్లు:
అవి.. ఇవి.. అన్నీ,
నా భావాలు,
రాజకీయరంగు
26, డిసెంబర్ 2009, శనివారం
ఏం తెలుసు?
గాలిలోకి ఎగిరిన రాయికి ఏం తెలుసు,అది ఒక అద్దాన్ని పగలగొడుతుందని!
రోడ్డు మీద తిరిగే బస్సుకి ఏం తెలుసు,
తను ఆల్లర్లల్లో తగలబడుతుందని!
ప్రభుత్వ ఆఫిసులకి ఏం తెలుసు,
ఉద్యమాల్లో తాము ధగ్థం అవుతామని!
సామాన్య పౌరుడికి ఏం తెలుసు,
ఆఖరికి కుటిల రాజకీయాలకి బలి అవుతామని!
లేబుళ్లు:
అవి.. ఇవి.. అన్నీ,
నాలో ఓ కవి,
రాజకీయరంగు
23, డిసెంబర్ 2009, బుధవారం
పాపం పోలీసులు..
మన రాష్ట్రం అట్టుడుకుతోంది , ఎక్కడ చూసిన నిరసనలు, బంద్లు, విద్వంసాలు వెరసి సామాన్యులకు(మనకు) తీవ్ర అసౌకర్య పరిస్తితి . మన సంగతి పక్కన పెడితే ఇక పోలీసులకి నరకం కనపడుతోంది నెల రోజుల నుండి.( ఉద్యమాలు, నిరసనలు, బందల సమయం లో మాత్రమే ఈ వ్యాసం పనికొస్తుంది ). చేతిలో ఆయుధం ఉన్నా ఎవరి మిద అధికారం లేకుండా ప్రయోగించకూడదు, దెబ్బలు తగిలి రక్తం కారుతున్న సంయమనం పాటించాలి, మనసుకు నచాకపోయిన పై అధికారులు చెప్పినట్టు నడుచుకోవాలి.
తల బొప్పి కడుతోంది వారికీ, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలిదు, అంతా ఉత్ఖంటత, ఈ రాజకీయ నాయకుల నాటకాలలో వారు బలి పశువులు అవుతున్నారు కూడా (ఒక ఎంపి రాజధానికి పారిపోయి వచ్చిన ఘటనలో) అటు ఇటు అయి బాగా నలిగిపోతున్నారు, రాష్ట్రంలో పాలనా స్థంబించింది , పోలీసులు సాధారణ విధి నిర్వహణ కంటే బందోబస్తులు పెరిగిపోయాయి ఉద్యమాల దెబ్బతో , మొత్తానికి మనకు {సామాన్యులకు}వోరిగేది ఏమి లేని ఈ ఉద్యమాల నడుమ విద్యార్థులు బలైపోతున్నారు. ఇంక రవాణా వ్యవస్త దేబ్బడింది. ఎప్పుడు సద్దుమనుగుద్దో ఏమో ! ఇటువంటి పరిస్తితుల్లో సంయమనం కోల్పోకుండా తమ విధులు నిర్వహిస్తున్న పోలిసువాళ్ళకి ధన్యవాదములు !
లేబుళ్లు:
అవి.. ఇవి.. అన్నీ,
నా భావాలు,
రాజకీయరంగు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



