గాలిలోకి ఎగిరిన రాయికి ఏం తెలుసు,అది ఒక అద్దాన్ని పగలగొడుతుందని!
రోడ్డు మీద తిరిగే బస్సుకి ఏం తెలుసు,
తను ఆల్లర్లల్లో తగలబడుతుందని!
ప్రభుత్వ ఆఫిసులకి ఏం తెలుసు,
ఉద్యమాల్లో తాము ధగ్థం అవుతామని!
సామాన్య పౌరుడికి ఏం తెలుసు,
ఆఖరికి కుటిల రాజకీయాలకి బలి అవుతామని!